మంచినీటిని కలుషితం చేస్తున్న డ్రైన్ నీరు

75చూసినవారు
మంచినీటిని కలుషితం చేస్తున్న డ్రైన్ నీరు
నిత్యం ప్రజలు వినియోగించే మంచినీటి బావిలోని నీరు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘంటసాల మండల పరిధిలోని దాలిపర్రు గ్రామంలోని పెద్ద నుయ్యి (బావి) నీరు మంచినీరు కలుషితంగా మారుతుందని ప్రజలు ఆదివారం పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో డ్రైన్ నీటి ఊట బావిలోకి రావటంతో నీరు కలుషితమై వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్