మోపిదేవి మండలంలోని వరద ప్రభావిత గ్రామమైన కే. కొత్తపాలెం దళితవాడ, గౌడ పాలెం ప్రాంతాల్లో గుంటలలో నిలిచి ఉన్న వరద నీటిని పంచాయతీ ఆధ్వర్యంలో బయటికి మళ్ళించే చర్యలు శుక్రవారం ప్రారంభించారు. ఆయా కాలనీలలో నాలుగు ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా బయటకు మళ్ళిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రామకోటేశ్వరరావు పనులను పర్యవేక్షించారు.