ఘంటసాల: లద్దె పురుగు పట్ల రైతులు ఆందోళన చెందవద్దు

72చూసినవారు
ఘంటసాల: లద్దె పురుగు పట్ల రైతులు ఆందోళన చెందవద్దు
మినుము, పొగాకు పంటలను ఆశించిన లద్దె పురుగు పట్ల రైతులు ఆందోళన చెందవద్దని, నివారణ చర్యలు చేపట్టాలని కెవికె ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డా. డి. సుధారాణి పేర్కొన్నారు. బుధవారం ఘంటసాలలో ఆమె మాట్లాడుతూ మెట్ట భూములను సాగు చేసిన మినుము, పొగాకు పంటల్లో లద్దె పురుగు ఆశించినట్లు గమనించటం జరిగిందన్నారు. వర్షాలు కురుస్తుండటం, తేమ శాతం అధికంగా ఉండటంతో ఈ పురుగు ఉదృతి కనిపిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్