అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు జాతీయ జెండాను గురువారం ఆవిష్కరించారు. స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన వీరుల త్యాగఫలాన్ని గుర్తు చేసుకుంటూ జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.