ఘంటసాల మండలం పుషడం గ్రామంలో ఆషాడమాసం సందర్భంగా, గ్రామంలో ఉన్న కుల దేవతలు, గ్రామ దేవతలకు బుధవారం వైభవంగా మేళ తాళాలతో గ్రామస్తులందరూ కలిసి ఆషాడ మాస సారె సమర్పించారు. అర్చక బృందం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులు తీసుకొచ్చిన సారెను అమ్మవార్లకు సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు, పలువురు పుర ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.