ఘంటసాల మండల పరిధి శ్రీకాకుళం శాఖా గ్రంధాలయంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోగినేనిపాలెం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు హాజరై డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం అందరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.