ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామానికి చెందిన టీడీపీ నేత, పారిశ్రామిక వేత్త యార్లగడ్డ సురేష్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. దాలిపర్రుకు చెందిన యార్లగడ్డ సురేష్ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. సురేష్ కు భార్య, కుమారుడు. కుమార్తె ఉన్నారు. సురేష్ మృతితో చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.