పేదవారు చట్టసభలకు వెళ్లేలా ప్రజాస్వామ్యంలో విప్లవాత్మక మార్పులు రావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. గురువారం అవనిగడ్డ గాంధీక్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి జాతీయ జెండా ఎగురవేశారు.