ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలు సిద్ధంచేసుకోవాల్సిందిగా సొసైటీ సీఈవోలకు ఆదేశాలిచ్చినట్లు జిల్లా సహకారశాఖ అధికారి(డీసీవో) కె. చంద్రశేఖరరెడ్డి తెలిపారు. చల్లపల్లి సొసైటీలో ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించేందుకు గురువారం ఆయన చల్లపల్లి వచ్చారు. ఈ సందర్భంగా డీసీవో విలేకర్లతో మాట్లాడుతూ, సొసైటీల కాలపరిమితి ఈ ఏడాది డిసెంబరులో ముగియనుందన్నారు.