గన్నవరం నియోజకవర్గం పరిధిలోని గూడవల్లి గ్రామం వద్ద బుడమేరు వరద ఉధృతిని బుధవారం కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పరిశీలించారు. గ్రామస్తులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని వరద ఉదృతి ఎక్కువ అయితే పోలీసు వారి సహాయం తీసుకోవాలని తెలిపారు.