గన్నవరంలో గంజాయి బ్యాగు కలకలం

50చూసినవారు
గన్నవరం నియోజవర్గం ఉంగుటూరు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై గంజాయితో బ్యాగులు వదిలి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం పారిపోయారు. గంజాయి బ్యాగులతో ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తుండగా పోలీసులను చూసి గంజాయి రవాణా చేసే బ్యాచ్ పారిపోయారు.
స్కూటీ, ఫోన్ రెండు గంజాయి బ్యాగులను ఆత్కూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి బ్యాగులు వదిలిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్