గన్నవరం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు, బుధవారం మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి కాళ్లు కడిగి అల్లు అర్జున్ నెత్తిన నీళ్లు చల్లుకోవాలని అన్నారు. అలా చేయకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ ప్రవర్తన వల్ల జనసైనికులకు, మెగా అభిమానులకు తీవ్ర బాధ కలిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగబాబులకు క్షమాపణలు చెప్పాలని కోరారు.