రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. రబీ సీజన్ సందర్భంగా మంగళవారం కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోషణ మరియు ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు 100 శాతం రాయితీపై మినుములు వి. బి. ఎన్ 8 రకం చిరు సంచులు పంపిణీ చేశారు.