నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన పెడన నియోజకవర్గం ప్రజలకు గురువారం నాడు కృతజ్ఞతలు తెలియజేశారు. పెడన నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలపై పనిచేస్తానని ఆయన మీడియా తో మాట్లాడారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని, పెడన నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు.