రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు వర్ష సూచన

63చూసినవారు
రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు వర్ష సూచన
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్