గుడివాడ పట్టణంలో పారిశుధ్య మెరుగుకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. మీకోసం మీ వెనిగండ్ల ఐదో రోజు ఉదయపు పర్యటనలో ఎమ్మెల్యే రాము శుక్రవారం పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై టైలరింగ్ స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బస్టాండ్ సెంటర్, ఎస్బిఐ బ్యాంకు రోడ్డులలో ఎమ్మెల్యే రాము పర్యటించారు.