గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని వసతులపై విద్యార్థిలను అడిగి తెలుసుకున్నారు. గుడివాడలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.