రావిరాల గ్రామంలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. నీళ్లు ఉన్నప్పటికీ త్రాగటానికి నోచుకోని రావిరాల గ్రామ ప్రజల కోసం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ శనివారం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామానికి మంచినీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో కృష్ణానది లోపల సరైన ప్రదేశం కోసం పరిశీలించి దానికి సంబంధించిన అంచనాలను తయారు చేయాలని ఆదేశించారు.