జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలోని గురుధాం వ్యవస్థాపకులు గెంటేల వెంకటరమణ దంపతుల షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గురువారం గెంటేల వెంకట రమణ వారి ప్రతినిధుల ద్వారా పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సమయంలో స్వీట్లు, పండ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.