కొంత మంది కబంధ హస్తాల్లో చిక్కుకున్న మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. శుక్రవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ, విజయవాడ ఎయిర్ పోర్టుకు అతి సమీపంలో ఉన్న మచిలీపట్నంలో కేపబిలిటీ సెంటర్ భవిష్యత్తరాలకు ఎంతో ఉపయుక్తం కానుందన్నారు. ఇక్కడ నుంచే కొన్ని పేటెంట్స్ వచ్చేలా కృషి చేస్తామని అన్నారు