మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ కు వచ్చిన భక్తులు సమీపంలోని డొంక రహదారుల్లో ఆదివారం ప్రయాణం చేస్తుండగా, వారిని బెదిరించి ఏఎస్ఐ డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. రూ. 150 నుంచి 500 వరకు నగదు వసూలు చేస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపించారు. కారు యాజమానుల వద్ద రూ. 1000 వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.