కార్తీక పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నంలోని మంగిన పూడి బీచ్ లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు శుక్రవారం ఉదయం వేలాదిమందిగా భక్తజనం తరలివచ్చారు. సముద్రంలో స్నానాలు ఆచరించిన అనంతరం సముద్ర తీరంలో కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఏర్పాట్లను పరిరక్షించారు. భక్తులకు ఉచిత మంచినీరు అందించడంతోపాటు వైద్య సిబ్బంది సేవలు అందించారు.