మచిలీపట్నం: దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

82చూసినవారు
మచిలీపట్నంలో మీడియా సోదరులతో కలిసి దీపావళి టపాకాయలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గురువారం కాల్చారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మంత్రి సందడిగా గడిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తుందని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కచ్చితంగా అండగా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శాస్త్రి, వినయ్ కుమార్, అడపా సాయి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్