మచిలీపట్నం: రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని వినతి

56చూసినవారు
మచిలీపట్నం: రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని వినతి
మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానాన్ని అమలు చేసి పారదర్శకంగా వ్యవహరించాలని రెక్టార్ కు బీ. సీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం మాట్లాడుతూ యూనివర్సిటీ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం అమలు పరచడం లేదని ఆరోపించారు. దీనివల్ల బీ. సీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్