మచిలీపట్నం: అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ

70చూసినవారు
మచిలీపట్నం: అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ
కృష్ణా జిల్లా నూతన ఏ. ఆర్ అడిషనల్ ఎస్పీగా బి. సత్యనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావుని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ జిల్లా నుండి కృష్ణా జిల్లాకు బదిలీపై వచ్చారు. సత్యనారాయణ గతంలో ఇదే జిల్లాలో ఏ‌ఆర్ అడిషనల్ ఎస్పీగా పని చేసిన అనుభవం ఉంది.

సంబంధిత పోస్ట్