కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సోమవారం కృష్ణ యూనివర్సిటీ నందు జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ సిబ్బంది ఏవిధంగా తమ విధులు నిర్వహించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని బట్వాడా చేయడంలో సిబ్బంది జాప్యం చేయకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.