ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు బోడవేరు కట్ట గత ఆరు రోజుల క్రితం గండి పడింది. శుక్రవారం నాటికి మూడు గండుల్లో రెండు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం బుడవేరు పనుల కోసం మద్రాస్ ఆర్మీని రంగంలోకి దింపారు. వారు బుడమేరు చేరుకొని పనులను పరిశీలిస్తున్నారు. నిద్రాహారాలు మాని అక్కడే పనులను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు ను అడిగి తెలుసుకుంటున్నారు.