మైలవరం: గొల్లపూడిలో ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి

52చూసినవారు
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వన్ సెంటర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతిని శనివారం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ. కేశినేని శివనాథ్, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే అధికారంలోకి తెచ్చిన గొప్పనేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్