చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేర గురువారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన తిరువూరు అడిషనల్ జడ్జ్ అట్లూరి సింధూర మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా పొందే సేవలను వినియోగించుకోవాలని, లోక్ అదాలత్ ల ద్వారా సాధ్యమైనంత వరకు కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని రాజీ మార్గమే రాజ మార్గమని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలియజేశారు.