చాట్రాయిలో మధ్యాహ్నం భోజనాన్ని పర్యవేక్షణ చేయాలి
చాట్రాయి మండలం కోటపాడు మండల పరిషత్ యూపీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో వంట సరిగా చేయకపోవడం వల్ల అనుభవరాహిత్యం వల్ల అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండలం నాయకులు ఆనందం ద్వజమెత్తారు. శుక్రవారం ఆయన చాట్రాయి తాహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకంపై నిరంతర పర్యవేక్షణ జరపాలని డిమాండ్ చేశారు.