మంగళగిరి సచివాలయంలో సీఎం చంద్రబాబును మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గానికి చెందిన వివిధ సంస్థలు, ప్రముఖులు సీఎం సహాయ నిధికి అందించిన రూ. 50,56,236/- విలువైన చెక్కులను సీఎం చంద్రబాబుకు మంత్రి అందజేశారు. విరాళాలు అందజేసిన వారికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపినట్లు మంత్రి చెప్పారు.