సనాతన ధర్మాన్ని ప్రతీ ఒక్కరూ కాపాడాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గూడూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూను అపవిత్రం చేయటంపై ప్రాయశ్చిత కార్యక్రమం, దేవాలయాలలో శుభ్రత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.