తక్షణమే మెస్ ఛార్జీలు పెంచాలని మధ్యాహ్న భోజన వర్కర్లు పెడనలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు కేవలం రూ. 3 వేల వేతనంతో బ్రతుకు చున్నామన్నారు. ఈ వేతనాలు కూడా మూడు నాలుగు నెలలకు ఇస్తున్నారన్నారు. తక్షణమే స్పందించి పదివేల రూపాయలు వేతనం అందించాలన్నారు.