పెడన: నిరసనకు పిలుపునిచ్చిన మిడ్ డే మీల్స్ సిబ్బంది

71చూసినవారు
ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం విద్యా శాఖ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నట్లు మిడ్ డే మీల్స్ ప్రతినిధులు సోమవారం సర్కులర్ జారీ చేశారు. మధ్యాహ్నం భోజనం పథక కార్మికుల వేతనాలు రూ. 10వేలు చేయాలన్నారు. పెరిగిన నిత్యవసర ధరలు అనుగుణంగా మెస్ ఛార్జీలను రూ. 30లకు పెంచాలన్నారు. అదేవిధంగా పనిచేసే ప్రాంతంలో కార్మికుల భద్రత, పలు అంశాలపై ఈ నిరసన ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్