పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన పాండ్రక గ్రామంలోని పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాడు - నేడు పథకం కింద పాఠశాలలో నూతన భవన నిర్మాణాలు చేపట్టారు. కానీ ఆ భవనాలను అసంపూర్తిగా వదిలివేయడంతో ఉపాధ్యాయులు అక్కడే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నిధులు గోల్ మాల్ చేయడం కారణంగా పనులు పూర్తి కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.