పెడన: ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టిన మున్సిపాలిటీ
పెడన పట్టణ మెయిన్ రోడ్డును ఆక్రమించిన వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారస్తులపై పెడన మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. శనివారం రాత్రి ప్రత్యేక రైడ్ నిర్వహించి రోడ్డును ఆక్రమించి కొట్లు నిర్మించిన వ్యాపారస్తులను పట్టణ పోలీస్ సహాయంతో తక్షణమే తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మన్నెం గోపాలరావు మాట్లాడుతూ ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఆక్రమణ తొలగింపు చెప్పడతామన్నారు.