పెడనలోని బిసి బాలుర హాస్టల్ ను సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వి. రామకృష్ణయ్య శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడిగి పలు సమస్యలను తెలుసుకున్నారు. వారికి అందుతున్న ఆహారం నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. హాస్టల్ లో పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శ్రీ వాణి, మొబైల్ కోర్టు జడ్జి వెంకట వాహిని పాల్గొన్నారు.