బంటుమిల్లి ప్రధాన కాలువ క్రింద గల బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో దాల్వా పంటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బంటుమిల్లి పట్టణంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా బంటుమిల్లి అంబేద్కర్ సెంటర్లో వారు రైతులతో సమావేశమై గత ఐదు సంవత్సరాలుగా పెడన నియోజకవర్గంలో దాల్వా పంట లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. తహశీల్దార్ భరత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.