భార్యభర్తలు గొడవపడటంతో భర్త అదృశ్యమయ్యాడు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం తాడిగడప
గ్రామానికి చెందిన సుగాలపల్లి
సోమిరెడ్డికి రాజేశ్వరితో వివాహాం జరిగింది. సోమిరెడ్డి అనారోగ్యంతో ఉండటంతో ఆ విషయమై ఇద్దరు 13 తేదీన ఘర్షణ పడ్డారు. భర్త ఇంటినుండి బయటకు వెళ్ళి అదృశ్యమయ్యాడు. దీంతో పలు చోట్ల వెతికి ఆదివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.