ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 41. లక్షలు స్వాహా చేసిన ఘటన ఆదివారం పెనమలూరు నియోజక వర్గంలో వెలుగు చూచింది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరుకి చెందిన లలితా రాణి అనే యువతి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో వర్క్ చేస్తోంది. బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్ ఇనిస్టిట్యూట్ పేరుతో వాట్సాప్ కి లింక్ రావటంతో లింక్ ద్వారా గ్రూప్ లో చేరి నేటి వరకు 41 లక్షలు ట్రేడింగ్ చేసింది. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.