రూ. 150 కోసం గొడవ.. ఒకరు మృతి

52చూసినవారు
రూ. 150 కోసం గొడవ.. ఒకరు మృతి
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పొద్దుటూరులో రూ. 150 కోసం గొడవ జరిగి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఈడే స్వామి వద్ద రూ. 150లు భుజంగరావు అనే వ్యక్తి అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి ఇవ్వాలని కోరగా వారి మధ్య గొడవ జరిగి స్వామి దాడి చేసాడు. తీవ్రంగా గాయపడిన భుజంగరావును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్