మాజీ సీఎం జగన్ ఫొటోల పిచ్చితో రూ. 700 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజేంద్ర కుమార్ జైన్ విమర్శించారు. బుధవారం ఆటోనగర్ లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. పాస్ బుక్ పై జగన్ ఫొటోల కోసం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారని అవినీతికి పాల్పడిన జగన్ తో పాటు వైసిపి నాయకులు శిక్ష తప్పదని పేర్కొన్నారు.