అంటరానితనం, విపక్షతపై అలుపెరగని పోరాటం చేసిన ప్రజానాయకుడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. శుక్రవారం విజయవాడ ఎంపీ కార్యలయంలో అంబేద్కర్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధన దిశగా ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.