ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపైదసరాఉత్సవాలు నాలుగో రోజు కు చేరుకున్నాయి. నేడు తెల్లవారుజామునరాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సామాన్య భక్తులకు సాఫీగాఅమ్మ దర్శన భాగ్యంకల్పించేలా సేవలు అందించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రిఆదేశించారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు.