సత్యసాయి జిల్లాలో కొత్తగా మరో పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత విజయవాడ కార్యాలయంలో మీడియాతో తెలిపారు. మడకశిర మండల కేంద్రంలోని మురా రాయన హల్లి గ్రామంలో కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్ ఏర్పాటుకానుందన్నారు. రూ. 1430 కోట్లతో వెయ్యి ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పరిశ్రమతో 565 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.