విజయవాడ: ప్రతి కుటుంబం సూర్య ఘర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
By KOLA 55చూసినవారుభావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, పథకం అమల్లో జిల్లాను నెం. 1లో నిలిపి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ ఇబ్రహీంపట్నంలో పీఎం సూర్యఘర్ పథకంతో లబ్ధి పొందుతున్న ఇంటిని సందర్శించారు.