అవనిగడ్డ: గ్రామీణ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది

51చూసినవారు
అవనిగడ్డ: గ్రామీణ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు. సోమవారం అవనిగడ్డ ఆరో వార్డులో ఉపాధి హామీ పథకం నిధులు రూ. 11. 40 లక్షలతో 195 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈఈ పగడాల సురేష్ బాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్