చల్లపల్లి మండలం రామానగరం గ్రామంలో ఊరి మధ్యన వైన్ షాపు వద్దు అని స్థానికులు గురువారం సాయంత్రం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలిపారు. కనీసం మహిళలు నడిచి వెళ్లేందుకు కూడా వీలు ఉండదని, తమ ఇబ్బందులు అర్థం చేసుకుని షాపును ఊరి బయటకు మార్చాలని కోరారు.