చల్లపల్లిలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పింగళి లక్ష్మీ కమల (డాక్టర్ మధుసూదనరావు భార్య) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతతో ఉన్న ఆమె చల్లపల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. డాక్టర్ లక్ష్మీకమల వైద్యురాలిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందారు. శనివారం ఉదయం చల్లపల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.