ఘంటసాల: మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని వినతి

66చూసినవారు
ఘంటసాల: మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని వినతి
జనావాసాల చెంతన మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని పరిసర ప్రాంత ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. గురువారం ఘంటసాల గ్రామ పరిధిలోని మల్లంపల్లి రోడ్డులోని పలువురు ఆ ప్రాంతీయులు డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గకు, మొవ్వ ఎక్సైజ్ సీఐ వరాల రాజులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లంపల్లి రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు పడతామన్నారు. నందం సుజాత, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్